గోవాలో కోటీతీర్థ కారిడార్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం సావంత్

రిపోర్టర్: అశోక్ స్థలం: Divar, Goa

గోవాలోని దివార్‌లో ప్రతిష్టాత్మక 'కోటీతీర్థ కారిడార్ అభివృద్ధి ప్రాజెక్టు' పనులను ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉదక శాంతి, గంగా పూజ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, స్థానిక అధికారులు పాల్గొన్నారు. పర్యాటక రంగంతో పాటు ఆధ్యాత్మికతకు ఈ కారిడార్ పెద్దపీట వేయనుంది.