సాదాబైనామా పట్టా మార్పిడికి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీపీవో
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: భీమిని
మంచిర్యాల జిల్లా సాదాబైనామా పట్టా మార్పిడి కోసం రైతు నుంచి రూ.80 వేల లంచం తీసుకుంటుండగా భీమిని జీపీవో దుర్గాప్రసాద్‌ను ఏసీబీ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. భీమిని మండలం పెద్దంపేటకు చెందిన మహమ్మద్ ఫకీర్ పట్టా మార్పిడి కోసం జీపీవోను సంప్రదించగా లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో పథకం ప్రకారం బాధితుడి ద్వారా రూ.80 వేలు ఇప్పిస్తుండగా ఏసీబీ డీఎస్పీ మధు ఆధ్వర్యంలోని బృందం దాడి చేసి దుర్గాప్రసాద్‌ను అదుపులోకి తీసుకుంది.