స్థానిక ఎన్నికల వేళ శాంతిభద్రతలకు విఘాతమంటూ చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: సునీల్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కూటమి నేతలు సమన్వయంతో పనిచేయాలని, ఓట్ల శాతాన్ని మరింతగా పెంచుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు.