కొండచరియలు విరిగిపడి సిక్కింలో పూర్తిగా స్తంభించిన రాకపోకలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: సిక్కిం

సిక్కింలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా భీకర పరిస్థితులు నెలకొన్నట్లు అధికారులు వెల్లడించారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో ప్రధాన రహదారులు ధ్వంసమై రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ముఖ్యంగా గ్యాంగ్టక్, గ్యాల్షింగ్ జిల్లాల్లోని రింబి తదితర గ్రామాల్లో భారీగా మట్టి చరియలు విరిగిపడి పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ ప్రకృతి విపత్తుతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలను ముమ్మరం చేసింది.