విజయనగరంలో తాగునీటి సరఫరాపై అనుభవం లేని ఫిట్టర్ల పెత్తనం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: విజయనగరం
విజయనగరం నగరపాలక సంస్థలో రెగ్యులర్ ఫిట్టర్లు లేక తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. అనుభవం లేని అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని కీలక విధుల్లో నియమించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు సిబ్బంది ముడుపులు వసూలు చేస్తూ, మెటీరియల్‌ను అక్రమంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు తక్షణమే స్పందించి నిపుణులను నియమించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.