ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు

రిపోర్టర్: కిరణ్ స్థలం: తెలంగాణ

త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముమ్మరం చేసినట్లు రాజకీయ వర్గాలు వెల్లడించాయి. నల్గొండ వరంగల్ ఖమ్మం మరియు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ స్థానాలకు ముగ్గురు చొప్పున ఆశావహుల జాబితాలు అధిష్టానానికి చేరాయి. గెలుపు గుర్రాల ఎంపిక కోసం సామాజిక సమీకరణాలపై కసరత్తు జరుగుతుండగా, ఒకటి రెండు రోజుల్లో అధికారిక జాబితా వెలువడే అవకాశం ఉందని పరిశీలకులు తెలిపారు.