సౌదీ అరేబియాకు మద్దతుగా నిలుస్తామంటూ టర్కీ కీలక ప్రకటన
రిపోర్టర్: కిరణ్
స్థలం: వరల్డ్
సౌదీ అరేబియాపై హౌతీల క్షిపణి దాడి నేపథ్యంలో ఆ దేశానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ వెల్లడించారు. సౌదీ ప్రాదేశిక భద్రతకు ముప్పు వాటిలితే అవసరమైన సాంకేతిక సైనిక సహాయం అందించడానికి టర్కీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నుంచి సౌదీ అరేబియాను దూరంగా ఉంచాలని ఆయన గట్టిగా కోరారు.