ఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద భారీగా పోటెత్తిన భక్తజనం
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ బడా గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. రాత్రి వేళల్లో భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో ప్రాంగణం కిటకిటలాడుతోంది. భక్తుల భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. డీసీపీ శిల్పవల్లి తెలిపిన వివరాల ప్రకారం, నిమజ్జనం వరకు సీసీ కెమెరాలు, షీ టీమ్స్‌తో ప్రత్యేక నిఘా ఉంచినట్లు వెల్లడించారు.