నూకల అభినవ్ రెడ్డి పాదయాత్రకు మద్దతు తెలిపిన భీమా నాయక్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: మరిపెడ
మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం నుండి కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం వరకు దివంగత నాయకులు నూకల నరేష్ రెడ్డి కుమారుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నూకల అభినవ్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ తో పాటు ఎల్ హెచ్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గూగులోతు భీమా నాయక్, రాష్ట్ర కన్వీనర్ ఏడేళ్లి వెంకన్న పాల్గొని ఘనంగా సంఘీభావం తెలిపారు.