మెర్సిడెస్ కారు హిట్ అండ్ రన్ కేసు: నిందితులకు బెయిల్ రద్దుకు కేరళ ప్రభుత్వం యత్నం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Kerala

మెర్సిడెస్ బెంజ్ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన జడ్జికి, ఆయన మైనర్ కుమారుడికి ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయించేందుకు ఉన్నత కోర్టును ఆశ్రయించనున్నట్లు కేరళ హోంమంత్రి రమేష్ చెన్నితాల తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున పూర్తి న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. ఎర్నాకుళంలో జరిగిన ఈ ప్రమాదంలో జయబాలకృష్ణన్ అనే వ్యక్తి మృతి చెందగా, ఈ ఘటనపై తొలుత వ్యవహరించిన పోలీసుల తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.