అమెరికాలో క్యాన్సర్తో పోరాడుతున్న ప్రవాసాంధ్రుడి కుటుంబానికి మంత్రి నారా లోకేశ్ భరోసా

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

అమెరికాలో క్యాన్సర్తో బాధపడుతూ చికిత్స పొందుతున్న తెలుగు యువకుడు పులిపాటి భరత్ కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని మంత్రి నారా లోకేశ్ భరోసానిచ్చారు. భరత్ సోదరితో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. భరత్ ఆరోగ్యం క్షీణించిన కారణంగా ప్రస్తుతం ప్రయాణాలు చేయడం సురక్షితం కాదని వైద్యులు సూచించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా తగిన సాయం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.