గాల్లో విమానంలో పైలట్ పై కత్తితో కో పైలట్ దాడి

రిపోర్టర్: సురేష్ స్థలం: దుబాయ్

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో కో పైలట్ అకస్మాత్తుగా కెప్టెన్ స్మిత్ మచ్చర్పై కత్తితో దాడికి దిగాడని అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడినప్పటికీ ధైర్యంగా ప్రతిఘటించిన కెప్టెన్ స్మిత్, సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేశారు. వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన ఆయన సాహసంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు పలువురు ప్రశంసల జల్లు కురిపించారు.