టెక్ ప్రపంచంలో కలకలం: అరవై వేల మందికి ఉద్వాసన పలకనున్న మైక్రోసాఫ్ట్

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

కృత్రిమ మేధస్సు యుగంలో రోబోలను నియమించుకుని మనుషులను తొలగించే పరిస్థితి వేగంగా వస్తోందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ హెచ్చరించారు. ఆయన హెచ్చరికల వేళ మైక్రోసాఫ్ట్ సంస్థ తమ మొత్తం ఉద్యోగుల్లో పావువంతు మందికి అనగా సుమారు అరవై వేల మందికి స్వచ్ఛంద నిష్క్రమణ బైఅవుట్ ఆఫర్ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ నిర్ణయం ద్వారా నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడమే ప్రధాన వ్యూహమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.