ఆది సాయికుమార్ హీరోగా డివైన్ మిస్టరీ థ్రిల్లర్: ఆది రుద్ర టైటిల్ ఖరారు
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న డివైన్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రానికి ఆది రుద్ర అనే పవర్ఫుల్ టైటిల్ను ఖరారు చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. నవరసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దసరా పర్వదినం సందర్భంగా ప్రత్యేక పోస్టర్ను విడుదల చేశారు. త్రిశూల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రశాంత్ జి రుద్రప్ప నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం జనవరిలో షూటింగ్ ప్రారంభించుకోనుందని మేకర్స్ స్పష్టం చేశారు.