శరత్చంద్ర ఛటోపాధ్యాయ జయంతి వేళ ప్రధాని మోదీ నివాళులు
రిపోర్టర్: నరేష్
స్థలం: India
ప్రఖ్యాత బెంగాలీ నవలా రచయిత శరత్చంద్ర ఛటోపాధ్యాయ 150వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా నివాళులు అర్పించారు. శరత్చంద్ర గొప్ప సాహిత్య ప్రతిభను, సమాజ సంస్కరణల కోసం ఆయన చేసిన కృషిని ప్రధాని కొనియాడారు. ఆయన రచనలు దేశ విదేశీ భాషల్లోకి అనువాదమై ఎంతో ఆదరణ పొందాయని, యువత ఆయన సాహిత్యం నుండి స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు.