ఇంటి నుంచే చిటికెలో డిజిటల్ ఓటర్ కార్డును డౌన్లోడ్ చేసుకోండి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాలకొండ
ఓటర్లు తమ డిజిటల్ ఓటర్ ఐడీ కార్డును నేరుగా ఇంటి నుంచే ఆన్లైన్ లో సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి లాగిన్ అయి ఈపీఐసీ నంబర్ నమోదు చేయాలి. మొబైల్కు వచ్చే ఓటీపీతో ధృవీకరించుకుంటే డిజిటల్ కార్డు లభిస్తుంది. అయితే ఎన్నికల సంఘం రికార్డుల్లో మొబైల్ నంబర్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.