ఆదోని తహశీల్దార్ కార్యాలయంలో ఆర్టీఐ బోర్డు కొరతతో ప్రజల ఇబ్బందులు
రిపోర్టర్: KISHORE M
స్థలం: ఆదోని
ఆదోని మండల రెవెన్యూ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమాచార అధికారి వివరాలు తెలియక దరఖాస్తుదారులు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. వెంటనే స్పందించి కార్యాలయంలో ఆర్టీఐ బోర్డు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.