ఖైరతాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చ

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తే అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. సిట్టింగ్ MLA దానం నాగేందర్‌కు బదులుగా క్లీన్ ఇమేజ్ ఉన్న కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పీ విజయారెడ్డి, రోహిణ్ రెడ్డి పేర్లతో పాటు దానంకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకునే ప్రత్యామ్నాయాలపై పార్టీ అధిష్టానం ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.