అమెరికాలో శంకర నేత్రాలయ సేవా కార్యక్రమం: ఘనంగా మ్యూజిక్ అండ్ డాన్స్ వేడుక
రిపోర్టర్: గోపి
స్థలం: Novi, Michigan
అమెరికాలోని మిచిగాన్ నగరంలో శంకర నేత్రాలయ యూఎస్ఏ సంస్థ ఆధ్వర్యంలో సంగీత, నృత్య ప్రదర్శనల ద్వారా కంటి వైద్య సేవల కోసం ప్రత్యేక నిధుల సేకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు బోర్డు ట్రస్టీ రమణ ముడెగంటి తెలిపారు. శ్రీ వేంకటేశ్వర ఆలయ సాంస్కృతిక వేదికపై జరిగిన ఈ వేడుకలో చిన్నారుల కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ యూనిట్ల ద్వారా ఉచిత వైద్యం అందించేందుకు దాతలు ముందుకు రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.