భారీ ఉత్కంఠ నడుమ ఇవాళ బాలాపూర్ లడ్డూ వేలంపాట

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా జరిగే వినాయక నిమజ్జన వేడుకలతో పాటు, ప్రసిద్ధ బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాట శుక్రవారం ఉదయం ప్రారంభం కానుంది. గత మూడు దశాబ్దాలకు పైగా నిరంతరం కొనసాగుతున్న ఈ ఆచారం పట్ల భక్తుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు 33 ఏళ్లుగా విజయవంతంగా సాగుతున్న ఈ వేలం పాటలో పాల్గొనేందుకు ఈ ఏడాది ఎనిమిది మంది సభ్యులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. గతేడాది రికార్డు స్థాయిలో 35 లక్షల ధర పలికింది.