దేశవ్యాప్తంగా ఘనంగా హిందీ దినోత్సవ వేడుకలు

రిపోర్టర్: అశోక్ స్థలం: India

భారతదేశంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 14న హిందీ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1949లో ఇదే రోజున రాజ్యాంగ పరిషత్ హిందీని అధికార భాషగా ఆమోదించింది. భాషా వైవిధ్యాన్ని సమతుల్యం చేయడానికి మున్షీ-అయ్యంగార్ ఫార్ములా కీలక పాత్ర పోషించింది. రాజ్యాంగంలోని 343 నుంచి 351 వరకు గల నిబంధనలు అధికార భాషకు సంబంధించిన విధివిధానాలను స్పష్టం చేశాయి.