సాయన్నగెడ్డ ఆధునికీకరించి రైతులకు శాశ్వత రక్షణ కల్పిస్తామన్న మంత్రి శ్రీనివాస్
రిపోర్టర్: నరేష్
స్థలం: సంతకవిటి
సాయన్నగెడ్డను పూర్తి స్థాయిలో ఆధునికీకరించి రైతులకు వరద ముప్పు లేకుండా శాశ్వత రక్షణ కల్పిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్పష్టం చేశారు. శనివారం సంతకవిటి మండలంలోని రామరాయపురం వద్ద వరదనీటి ముంపునకు గురైన పంటపొలాలను వారు పరిశీలించారు. ఏటా వరదల వల్ల వేలాది ఎకరాల్లో పంట నష్టం జరుగుతోందని రైతులు తమ గోడును వెలిబుచ్చారు. పొలాల్లో నీరు తగ్గిన వెంటనే పంట నష్టంపై సర్వే చేసి నివేదికలు అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.