పట్టిసీమ ప్రాజెక్టు రికార్డులు: కృష్ణా నదికి 500 టీఎంసీలకు పైగా జలాల తరలింపు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Andhra Pradesh
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో పన్నెండేళ్ల క్రితం పదహారు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలతో రూపుదిద్దిన పట్టిసీమ ప్రాజెక్టు అద్భుత రికార్డులు బద్దలు కొట్టిందని తెలుగు దేశం పార్టీ వెల్లడించింది. గతంలో పట్టిసీమను వట్టిసీమ అంటూ విమర్శించిన వారి నోళ్లు మూతబడేలా గోదావరి నుంచి ఐదు వందల టీఎంసీలకు పైగా నీటిని కృష్ణా నదికి తీసుకొచ్చి, పదమూడు లక్షల ఎకరాల కృష్ణా డెల్టా ఆయకట్టును విజయవంతంగా సస్యశ్యామలం చేసినట్లు ఆ పార్టీ పేర్కొంది.