యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతిబింబమైన సద్దుల బతుకమ్మ వేడుకలు ఆదివారం రాజపేట మండలంలో సాంప్రదాయంగా ఘనంగా జరుపుకున్నారు. అన్ని గ్రామాలలో ప్రధాన కూడలలో దేవాలయాల ముందు సద్దుల బతుకమ్మల సంబరాలు కనిపించాయి. మహిళలు కొత్త బట్టలు ధరించి బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీరామకృష్ణ సాయి మందిరం ఆలయ ప్రధాన అర్చక స్వాములు చలివేదుల వెంకట రామకృష్ణ ప్రసాద శర్మ పూజల సందర్భంగా విశిష్టతను వివరించారు.