వయసుతో సంబంధం లేదు.. 45 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన మహిళ!
రిపోర్టర్: హరి
స్థలం: జమ్మూ
జమ్మూకు చెందిన 45 ఏళ్ల మూగ, చెవుడు ఉన్న కాశ్మీరీ పండిట్ మహిళ రేణు హన్స్, 22 ఏళ్ల తర్వాత పట్టుదలతో పదో తరగతి పరీక్షల్లో 82 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. ఆమె కుమారుడు నమన్ కౌల్ స్వయంగా ట్యూషన్ చెప్పి తల్లిని చదివించడంతో పాటు ఈ విజయానికి వెన్నెముకగా నిలిచారు. వయసుతో సంబంధం లేకుండా చదువుపై ఆమె చూపిన మక్కువ అందరికీ స్ఫూర్తినిస్తోంది.