డబ్లిన్‌లో డొనాల్డ్ ట్రంప్‌నకు వ్యతిరేకంగా భారీ నిరసనలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: World
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐర్లాండ్ పర్యటనను వ్యతిరేకిస్తూ వేలాది మంది డబ్లిన్ వీధుల్లో నిరసనకు దిగారు. ఆయన విదేశీ, దేశీయ విధానాలతో పాటు ఉత్తర ఐర్లాండ్ విలీన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలస్తీనా జెండాలు పట్టుకుని ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దౌత్య సంప్రదాయాలను దెబ్బతీస్తున్నారంటూ ఆందోళనకారులు మండిపడ్డారు.