లేబర్ కోడ్స్ అమలుపై రైల్వే శాఖతో కేంద్ర కార్మిక శాఖ కీలక భేటీ
రిపోర్టర్: విజయ్
స్థలం: New Delhi
దేశవ్యాప్తంగా నూతన లేబర్ కోడ్స్ ను మరింత సమర్థవంతంగా అమలు చేసే దిశగా కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కీలక ముందడుగు వేసింది. న్యూఢిల్లీలోని శ్రమేవ్ జయతే భవన్ లో చీఫ్ లేబర్ కమిషనర్ సోనాల్ మిశ్రా ఆధ్వర్యంలో రైల్వే బోర్డు సీనియర్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించినట్లు Ministry of Labour & Employment, GoI వెల్లడించింది. కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమం, చట్టపరమైన నిబంధనల పాటించడంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు.