తిరుమలలో వైభవంగా గరుడ వాహన సేవ భక్తుల భారీ రద్దీ
రిపోర్టర్: శివ
స్థలం: Tirupati
తిరుమల క్షేత్రంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం శ్రీనివాసుడు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ పవిత్ర సేవను తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తిరుమలకు పోటెత్తడంతో ఘాట్ రోడ్లు కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీని నియంత్రించేందుకు టీటీడీ అధికారులు కొండపైకి ప్రైవేట్ వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసి, సెప్టెంబర్ 20 వరకు ద్విచక్ర వాహనాలపై సంపూర్ణ నిషేధం విధించారు.