అక్రమ కేసులతో బెదిరించలేరంటూ రేవంత్ రెడ్డి సర్కార్ కు కేటీఆర్ సవాల్

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టు పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్యేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డంపెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలరాజు యాదవ్ పై బనాయించిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, ఆయన్ను బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.