ఫుట్‌బాల్ ఆటగాడి నుంచి ఉగాండా రాజ్యాన్ని ఏలబోతున్న జార్జ్ డెస్మండ్!

రిపోర్టర్: గోపి స్థలం: World

ఇంగ్లాండ్‌లో సాధారణ ఫుట్‌బాల్ గోల్‌కీపర్‌గా ఉన్న 36 ఏళ్ల జార్జ్ డెస్మండ్ కమురాసి ఉగాండాలోని చారిత్రాత్మక టోరో రాజ్యానికి నూతన రాజుగా ఎంపికయ్యారు. క్యాన్సర్‌తో మృతిచెందిన కింగ్ ఒయో స్థానంలో ఆయనను రాజవంశ కమిటీ ఎంపిక చేసింది. కైదు జీవితం నుంచి ఫుట్‌బాల్ ద్వారా అసాధారణ ప్రయాణం సాగించి ఇప్పుడు ఏకంగా సింహాసనాన్ని అధిష్టించబోతుండటం విశేషం.