రాప్తాడు హైస్కూల్ లో భయానక వాతావరణం: ముగ్గురు విద్యార్థులతో వెలవెలబోతున్న పాఠశాల

రిపోర్టర్: మహేష్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకున్న గోపిక, లక్ష్మి ఘటన విద్యార్థుల్ లో తీవ్ర భయాందోళనలను నింపిందని స్థానికులు తెలిపారు. పాఠశాల ఆవరణలో జరిగిన ఈ దారుణ సంఘటనతో తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు వెనుకాడారు. దీంతో మూడు వందల యాభై మంది విద్యార్థులకు గాను కేవలం ఐదుగురు మాత్రమే హాజరయ్యారని, అధికారులు తక్షణమే భద్రత కల్పించి భయం పోగొట్టాలని స్థానికులు కోరారు.