మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టిన దుండగులు

రిపోర్టర్: నరేష్ స్థలం: హరియాణా

గురుగ్రామ్‌లో మహిళా బైకర్‌ను వెంబడించి కారుతో ఢీకొట్టారు. తనను వెంబడించవద్దని వారించినందుకు కారుతో బలంగా తగిలించడంతో బాధితురాలు సియా రోడ్డుపై పడిపోయింది. ఈ ఘటన యాక్షన్ కెమెరాలో రికార్డైంది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తులే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోలీసులను కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది.