జింబాబ్వేపై రెండో వన్డేలో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా

రిపోర్టర్: సునీల్ స్థలం: హరారే

హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 84 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ సెంచరీతో రాణించగా, లెగ్ స్పిన్నర్ ఆదం జంపా వన్డేల్లో 200 వికెట్ల మైలురాయిని అందుకుని షేన్ వార్న్ సరసన నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 356 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో జింబాబ్వే 272 పరుగులకే పరిమితమైంది.