వైద్య రంగాన్ని రేవంత్ రెడ్డి పూర్తిగా నిర్వీర్యం చేశారు: ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్

రిపోర్టర్: శివ స్థలం: Hyderabad

తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉపన్యాసాలు తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో తీర్చిదిద్దిన వైద్య రంగాన్ని ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. మెడికల్ కళాశాలల్లో కనీస వసతులు కూడా లేవని, విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.