అటవీ భూమిని ఆక్రమించేందుకు యత్నించిన వ్యక్తిపై కేసు నమోదు

రిపోర్టర్: ASIF reporter స్థలం: నిజామాబాద్ రూరల్

నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలం రావుట్ల రిజర్వ్ ఫారెస్ట్లోని కంపార్ట్మెంట్ నం.395లో చెట్లు నరికివేసి అటవీ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై అటవీ అధికారులు కేసు నమోదు చేశారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కె. నరసింగరావు ఆదేశాలతో అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు చేపట్టారు. అటవీ సంపదకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది.