నర్సంపేట సమీపంలో రెండు బైకులు ఢీ: ఇద్దరికి తీవ్ర గాయాలు
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
వరంగల్ జిల్లా నర్సంపేట పరిధిలోని ఖాదర్పేట శివారు మూలమలుపు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ముడిసరుకుల వ్యాపారి కొత్త సత్యనారాయణతో పాటు మరో వ్యక్తికి తీవ్ర రక్తగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది పైలట్ నాగరాజు, ఈఎంటీ ప్రవీణ్ కుమార్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించి బాధితులను నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.