తుఫాన్ బీభత్సం: ఏపీలో క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమైన ముఖ్యమంత్రి చంద్రబాబు

రిపోర్టర్: రాము స్థలం: అమరావతి

అర్నాబ్ తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ ఆస్తి, పంట నష్టం వాటిల్లిన నేపథ్యంలో, గురు, శుక్రవారాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి స్థానిక పరిస్థితులను పరిశీలించడంతో పాటు, బాధితులను రామర్శించి భరోసా కల్పిస్తారని వివరించారు. మరోవైపు ఈ పరిణామాలపై చర్చించేందుకు గురువారం ఏపీ కేబినెట్ భేటీ కానున్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.