కీళ్ల నొప్పుల బాధితులకు తీవ్ర అలర్ట్: నిరంతర అలసటపై డాక్టర్ హెచ్చరిక
రిపోర్టర్: విజయ్
స్థలం: New Delhi
కీళ్ల నొప్పులతో బాధపడేవారిని విపరీతమైన అలసట వేధిస్తుందని రుమటాలజీ నిపుణులు డాక్టర్ శ్రీ రామ్ గార్గ్ స్పష్టం చేశారు. కీళ్ల నొప్పులు, వాపులతో పాటు నిరంతర నీరసం కూడా రోజూవారీ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన వెల్లడించారు. తగినంత నిద్ర పోయినా ఈ సమస్య తగ్గదని, శరీరంలో వాపులు, నిద్రలేమి, నొప్పుల కారణంగా శక్తి సన్నగిల్లుతుందని తెలిపారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు నిపుణుల సలహాతో జీవనశైలి మార్పులు చేసుకోవాలని ఆయన సూచించారు.