వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

రిపోర్టర్: సతీష్ స్థలం: Mahabubabad

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, కాలయాపన కారణంగా ఆంటోనీ నాగరాజు (50) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. న్యూ నెహ్రూ స్ట్రీట్ కు చెందిన నాగరాజు అకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరుకోగా, స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే పీహెచ్‌సీ, 108 సిబ్బంది సమయస్ఫూర్తి కనబరచకపోవడం, వేగంగా స్పందించకుండా జాప్యం చేయడంతోనే ఆయన మృతి చెందాడని బంధువులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.