పెదబయలు జడ్పీటీసీ అభ్యర్థిగా కొర్ర శోభారాణి ఖరారు
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: పెదబయలు
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం జడ్పీటీసీ అభ్యర్థిగా జాతీయ కాంగ్రెస్ పార్టీ కొర్ర శోభారాణిని ఎంపిక చేసింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆమె పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో పెదబయలు మండలంలో పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పార్టీ శ్రేణులు తీవ్రంగా ఆకాంక్షించాయి.