నిరుద్యోగులకు గుడ్ న్యూస్: రైల్వే స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి ప్రకటన
రిపోర్టర్: రమేష్
స్థలం: తెలంగాణ
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1215 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నవంబర్ 25వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.