వందే భారత్ రైలుకు అదనపు బోగీలు పెంచాలంటూ పెద్దపల్లి ఎంపీకి విజ్ఞప్తి

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

మంచిర్యాల మీదుగా రాకపోకలు సాగిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని కోరుతూ డివిజనల్ రైల్వే మెంబర్ అనుమాస శ్రీనివాస్ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు వినతిపత్రం అందజేశారు. గతంలో ఇరవై బోగీలతో నడిచిన ఈ రైలును ప్రస్తుతం కేవలం ఎనిమిది బోగీలతో నడుపుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రామగుండం, మంచిర్యాల స్టేషన్లలో స్టాపేజీ కల్పించాలని ఎంపీని కోరారు.