ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉద్యోగం: ప్రొఫెషనల్ డూమ్స్క్రోలర్ పోస్ట్ భర్తీకి కంపెనీ ప్రకటన
రిపోర్టర్: రాము
స్థలం: ఉదయ్‌పూర్
రోజంతా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ వైరల్ ట్రెండ్స్ గుర్తించే విభిన్నమైన ఉద్యోగాన్ని రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ కు చెందిన ఇన్ఫ్లుయిష్ కంపెనీ ప్రకటించిందని నిర్వాహకులు తెలిపారు. ప్రొఫెషనల్ డూమ్స్క్రోలర్ పేరుతో కేవలం సోషల్ మీడియాలో రీల్స్ చూసే ఈ పోస్ట్ కోసం భారీ స్పందన వస్తోందని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు కామెంట్ చేస్తే అప్లికేషన్ లింక్ ఇస్తామని కంపెనీ వెల్లడించింది.