భద్రాచలానికి గణపతి నిమజ్జన ఊరేగింపుగా బయలుదేరిన ఆర్యవైశ్య సంఘం నాయకులు
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులు ముగింపు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి బ్యాండ్ మేళాలు, నృత్యాల నడుమ గణపతి నిమజ్జనం కోసం భద్రాచలానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కోడిత్యాల నరేందర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.