కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన కొండా మురళి

రిపోర్టర్: సురేష్ స్థలం: వరంగల్

తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తొలగించిన తర్వాత కాంగ్రెస్ వీడుతున్నట్లు వస్తున్న ఊహాగామాలను ఆమె భర్త కొండా మురళి ఖండించారు. పదవి కోసం ఆత్మగౌరవాన్ని వదులుకోబోమని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. క్షమాపణ చెప్పేది లేదని తేల్చిచెప్పారు. రాహుల్‌గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యమని, తమ విధేయత కాంగ్రెస్ పార్టీకేనని ఉద్ఘాటించారు.