స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి, వైకాపా దోస్తీ: పదవుల పంపకంపై సర్వత్రా చర్చ

రిపోర్టర్: సురేష్ స్థలం: నంద్యాల

నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు, ఆళ్లగడ్డ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి, విపక్ష వైకాపా నాయకులు విచిత్ర ఒప్పందానికి తెరతీశారని అధికారులు తెలిపారు. రెండుచోట్లా ఛైర్పర్సన్ పదవులను తెదేపాకు కేటాయించగా, ఒకచోట వైస్ఛైర్పర్సన్ పదవిని వైకాపాకు ఇచ్చేలా పంచుకున్నారు. ఈ రాజకీయ సర్దుబాటుపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే ఎన్నికల ప్రక్రియను ఎస్ఈసీ నిలిపివేయడంతో ఉత్కంఠ నెలకొంది.