నేల ఆరోగ్యం కాపాడుతూ సేంద్రియ సాగు చేపట్టాలంటూ రైతులకు శాస్త్రవేత్తల దిశానిర్దేశం

రిపోర్టర్: MADHIRI CHANTIBABU స్థలం: జి.కె.వీధి

గూడెంకొత్తవీధి మండలంలోని సంకాడ రైతు సేవా కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి ఎన్. సురేష్ ఆధ్వర్యంలో ఖేత్ బచావో అభియాన్ పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు నేల ఆరోగ్య పరిరక్షణ, భూసార పరీక్షల ఆధారంగా సమతుల్య ఎరువుల వినియోగం, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ప్రాముఖ్యతను రైతులకు పూర్తిగా వివరించారు.