వైద్య నిపుణుల హెచ్చరిక: పోలియో నివారణకు ఓపీవీ ఐపీవీ టీకాలు ఎందుకు ముఖ్యం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తెలంగాణ
పోలియో వైరస్ నివారణలో ఓపీవీ మరియు ఐపీవీ రెండు టీకాలు విభిన్నంగా రక్షణ కల్పిస్తాయని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. నోటిద్వారా ఇచ్చే ఓపీవీ పేగుల్ లో రోగనిరోధక శక్తిని పెంచితే, ఇంజెక్షన్ ద్వారా ఇచ్చే ఐపీవీ నాడీ వ్యవస్థను రక్షిస్తుందని తెలిపారు. భారత్ 2014లో పోలియో రహిత దేశంగా గుర్తింపు పొందినప్పటికీ, పూర్తి రక్షణ కోసం పిల్లలందరికీ రెండు రకాల టీకాలు తప్పనిసరిగా వేయించాలని వైద్యులు పేర్కొన్నారు.