ఐఐటీ ఢిల్లీ కీలక నిర్ణయం: విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక సంస్కరణలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: New Delhi

విద్యార్థి రిషికేశ్ కుమార్ మృతి నేపథ్యంలో ఐఐటీ ఢిల్లీ కీలకమైన సంస్థాగత సంస్కరణలను ప్రకటించిందని, మానసిక ఆరోగ్య మద్దతును బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. న్యాయమూర్తి ముక్తా గుప్తా నేతృత్వంలోని బాహ్య విచారణ కమిటీ సిఫారసుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అదనపు కౌన్సెలర్ల నియామకం, ప్రత్యేక రీ-ఎంట్రీ ప్రోటోకాల్స్ అమలుతో పాటు విద్యార్థుల సంక్షేమం కోసం సమగ్ర కార్యాచరణను రూపొందించినట్లు సంస్థ స్పష్టం చేసింది.