అల్లూరి జిల్లాలో వరద బీభత్సం కొండచరియలు విరిగిపడి నిలిచిన రాకపోకలు
రిపోర్టర్: గోపి
స్థలం: అల్లూరి జిల్లా
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, గెడ్డలు పొంగి ప్రవహిస్తూ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. కొయ్యూరు, పాడేరు, జి.మాడుగుల, జీకే వీధి మరియు చింతపల్లి మండలాల్లో జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో పాటు రోడ్లు, కల్వర్టులు కొట్టుకుపోయాయి. బొక్కెలు సమీపంలో వంతెన బీటలు వారుండగా, అగ్రహారం వంతెనపై నీరు ప్రవహించడంతో పది గ్రామాలతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.